Sunday, November 17, 2024

TG: తెలంగాణలో ఈనెల 15నుంచి అమ్మ మాట – అంగన్వాడీ బాట..

హైదరాబాద్, జులై 12 : తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 15నుంచి అమ్మ మాట- అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తెలంగాణలో రెండున్నరేళ్లు దాటిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లోని ప్రీప్రైమరీ పాఠశాలల్లో చేర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందుకోసం కొత్తగా ప్రీ ప్రైమరీ సిలబస్‌ను సిద్ధం చేసింది. చిన్నారుల్ని గుర్తించి ఈ ప్రీప్రైమరీ పాఠశాలల్లో చేర్చించేందుకు ఈనెల 15 నుంచి 20 వరకు అమ్మ మాట – అంగన్వాడీ బాట పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపడుతోంది. ఈ కార్యక్రమం చివరి రోజున సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించనుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement