ఆదిలాబాద్ జిల్లాలో కేంద్ర మంత్రి అమిత్ షాకు నిరసన సెగ తగిలింది. ఇవ్వాల (మంగళవారం) ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన జనగర్జన సభకు వచ్చిన ఆయన కాన్వాయ్‌ను కొంతమంది ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఆదిలాబాద్ సీసీఐ సాధన కమిటీ సభ్యులు ప్లకార్డులతో తరలివచ్చి, కాన్వాయ్‌ని అడ్డుకోబోయారు. అమిత్ షా డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీసీఐ పునరుద్ధరణ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, సీసీఐ సాధన కమిటీ సభ్యులకు మధ్య కాసేపు తోపులాట జరిగింది. అనంతరం ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
Breaking | అమిత్‌షాకు నిరసన సెగ.. కాన్వాయ్‌ని అడ్డుకున్న ఆందోళనకారులు
Advertisement
తాజా వార్తలు
Advertisement