Monday, October 7, 2024

Amit Shah – వచ్చే ఆరు నెలల్లో వామపక్ష ఉగ్రవాద రహిత దేశంగా మారుస్తాం

ఆంధ్రప్రభ స్మార్ట్, నూఢిల్లీ – వచ్చే ఆరు నెలల్లో భారత్ ను వామపక్ష ఉగ్రవాద రహిత దేశంగా మార్చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి ఉద్ఘాటించారు. చత్తీస్‌గ‌ఢ్‌ అబుజ్ మడ్ దండకారణ్యంలో భారీ ఎన్‌కౌంటర్, 31 మంది కీలక మావోయిస్టుల మృతి ఘటన నేపథ్యంలో .. నక్సల్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలు, హోంమంత్రులు, ఉన్నత పోలీసు అధికారులతో సమీక్ష నిర్వ‌హించారు.

ఒకరకంగా మావోయిస్టులే టార్గెట్‎గా కేంద్ర ప్రభుత్వం తన చర్యల వేగాన్ని పెంచింది. ఈ స్థితిలో సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‎లో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ సమీక్ష సమావేశమ‌య్యారు.

ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి‌ శాంతికుమారి, డీజీపీ జితేందర్‌, ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు, చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ హాజరయ్యారు.

- Advertisement -

2026 మార్చి నాటికి నక్సలిజం అంతం,

అర్బన్ నక్సల్ అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ భేటీలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలు, హోం మంత్రులు, సీఎస్‎లు, డీజీపీలు, కేంద్ర మంత్రులు, పలు కీలక శాఖల కార్యదర్శులు, కేంద్ర సాయుధ బలగాల, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. దేశంలో మావోయిస్టు సమస్యను లేకుండా చేయడమే ప్రస్తుత లక్ష్యమని ఇప్పటికే అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణ, రాష్ట్రాల భాగస్వామ్యంపై చర్చించారు.

ఈ సమీక్ష సమావేశానికి ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‎ఘడ్, కేరళ రాష్ట్రాల మంత్రులు, అధికారులు హాజరయ్యారు.

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుతం ఉన్న భద్రత సమస్య నుంచి ఆయా ప్రాంతాలకు విముక్తి కల్పించడం, సమాచార వ్యవస్థను నెలకొల్పడం, ఆయా ప్రాంతాల్లో ఏకలవ్య పాఠశాల ఏర్పాటు వంటి కీలక అంశాలపై చర్చించారు.

కేంద్రం చేపట్టే కార్యక్రమాల వివరాలను రాష్ట్రాలకు ఆయా శాఖల కేంద్ర మంత్రులు వివరించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం చేపట్టిన ఆపరేషన్, సాయుధ బలగాల కార్యాచరణ, బలగాల మోహరింపు వివరాలను ఇంటిలిజెన్స్ అధికారులు అందించారు.

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు అభివృద్ధి సాయాన్ని అందిస్తున్న మరో ఐదు కేంద్ర శాఖల మంత్రులతో పాటు డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజ‌ర్‌, కేంద్ర, రాష్ట్రాల ఉన్నతాధికారులు, కేంద్ర సాయుధ బలగాలకు చెందిన సీనియర్ ఆఫీసర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో నక్సల్స్ ఏరివేత, తాజా పరిస్థితులు, అభివృద్ధి ఇతర అంశాలపై చర్చించారు

ఆపరేషన్ కగార్ సక్సెస్

నక్సల్ ఏరివేత కార్యక్రమంలో భాగంగా ఆపరేషన్ కగార్ లో నక్సల్ ను ఏరివేత లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. వివిధ అధికారుల మనో భావాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ రాష్ట్రాల డీజీపీలు మాట్లాడారు.

వీరు తెలిపిన అంశాల ప్రకారం, . ముఖ్యంగా మారుమూల ప్రాంతాల అభివృద్ధికి నక్సల్ పెద్ద అడ్డుగోడగా నిలిచారు. అంతేకాదు ప్రభుత్వం గిరిజనులకు అందిస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మావోలు అడ్డుకుంటున్నారనే వాదన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. అంతేకాదు మారుమూల గిరిజన ప్రాంతాల్లోని యువకులను బలవంతంగా మావోయిస్టు పార్టీలో చేర్చుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది.

వారి దళంలో చేరకపోతే కుటుంబ సభ్యులను ఊచకోత కోస్తారనే భయంతో కొంత మంది గిరిజనులు, స్థానికులు బలవంతంగా మావోయిస్టు పార్టీలో చేరుతున్నారు. మరికొందరు స్వచ్ఛందంగా మావో సిద్దాంతాలకు ఆకర్షితులై ఆ పార్టీలో చేరుతున్నట్టు సమాచారం. ఈ దిశలో గత పదేళ్లలో నక్సల్స్ ఏరివేతే లక్ష్యంగా ఎన్నో ఆపరేషన్లను కేంద్రం చేపట్టింది. అలాగే యువత, కొత్తవారు నక్సలిజం వైపు ఆకర్షితులు కాకుండా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది.

కొన ఊపిరిలో వామపక్ష ఉగ్రవాదం

ప్రస్తుతం వామపక్ష తీవ్రవాదం కొన ఊపిరితో ఉందని కేంద్ర హోంశాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. తాజా లెక్కలే ఇందుకు నిదర్శనమని తెలిపింది. గడిచిన 280 రోజుల్లో జరిగిన ఎన్ కౌంటర్లలో 202 మంది నక్సల్స్ మృతిచెందారని ప్రకటించింది. అలాగే ఈ ఏడాది 723 మంది మావోయిస్టులు లొంగిపోగా, 812 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించింది. ఇక 2010తో పోల్చితే మావోయిస్టులు చేపట్టిన హింసాత్మక ఘటనలు72 శాతం మేరకు తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

హింస కారణంగా చనిపోయినవారి సంఖ్య కూడా 86 శాతం తగ్గిందని కేంద్రం తెలిపింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 14,400 కి.మీ. పొడవైన రోడ్లతోపాటు 6,000 మొబైల్ టవర్లు నిర్మించినట్టు వివరించింది.ఉగ్రవాద రహిత దేశమే లక్ష్యంగా.. దేశంలోని ఉగ్రవాద ప్రభావిత రాష్ట్రాల్లో అభివృద్ధి, సంక్షేమం సమతూకంతో నడవాలి. సమాంతన ఉగ్రవాద పాలనపై దండెత్తాలి. అందుకు రవాణా. సమాచార వ్యవస్థల్ని బలోపేతం చేసుకోవాలి. ఇక్కడ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేయాలి. కేంద్ర బలగాలతో రాష్ర్ట పోలీసులూ జత కలవాలి. నిఘా వ్యవస్థను పటిష్ట పర్చుకోవాలి. చత్తీస్ గఢ్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా పని చేశాయి. దశాబ్దాలుగా తిష్టవేసిన మావోయిస్టుల ఏరివేతలో సత్ఫలితాలు సాధిస్తున్నాయి. గ్రామాల్లో పరిస్థితి మారింది. ప్రజలు ప్రజాస్వామ్యం వైపు మొగ్గు చూపుతున్నారు. ఎన్నికలు సక్రమంగా జరుగుతున్నాయి. త్వరలోనే మావోయిస్టుల రహిత రాష్ర్టంగా చత్తీస్ గడ్ ఆవర్భించబోతోందని, ఇందుకు ఏపీ, తెలంగాణ, ఒడిషా, మహారాష్ర్ట ప్రభుత్వాలు ఇప్పటికే సంపూర్ణ సహకారం ఇచ్చాయని, మున్ముందు మరింత అప్రమత్తం కావాలని కేంద్ర మంత్రి అమిత్ షా కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement