Friday, November 22, 2024

TS: అమిత్ షా పై ఫేక్ వీడియో… రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు

హైదరాబాద్‌: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌ కేసులో సీఎం రేవంత్‌ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సమన్లు జారీ చేసి.. మే 1న విచారణకు హాజరు కావాలని కోరారు. ఫోన్‌ తీసుకొని విచారణకు రావాలని సమన్లలో పేర్కొన్నారు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కేసులో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడికి నోటీసులు ఇచ్చేందుకు ఇద్దరు ఢిల్లీ పోలీసు అధికారులు గాంధీభవన్‌కు వచ్చారు. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో..కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు చెందిన మన్నె సతీష్, నవీన్, శివకుమార్, తస్లీమ్‌కు నోటీసులు జారీ చేశారు. సీఆర్పీసీ 91 కింద పోలీసులు నోటీసులు ఇచ్చారు. .. మే 1న విచారణకు హాజరు కావాలని సమన్లలో ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఐటీ యాక్ట్‌లోని పలు సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

తొలి అరెస్ట్ అస్సాంలో..

- Advertisement -

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పేరిట వైరలవుతున్న కొన్ని నకిలీ వీడియోలపై ఢిల్లీ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు మేరకు ఢీల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేసినందుకు కాంగ్రెస్ సీనియర్ నేత రీతోమ్ సింగ్ ను అరెస్ట్ చేసినట్లు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ట్వీట్ చేశారు.

అమిత్‌ షా ఈ నెల 23న తెలంగాణలో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. అక్కడ మాట్లాడుతూ ”భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన ఆ హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తాం” అని వ్యాఖ్యానించారు. దీన్ని కొంతమంది వక్రీకరించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్‌ను రద్దు చేస్తామని షా చెబుతున్నట్లుగా ఎడిట్‌ చేశారని బిజెపి ఆరోపించింది..

ఎన్నిక‌ల‌లో గెలిచేందుకే ఈ ఎత్తుగ‌డ

తనకు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు వచ్చారని.. మోడీ ఇప్పటి వరకు విపక్షాలపై సీబీఐ, ఈడీని ప్రయోగించారన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఢిల్లీ పోలీసులనూ ప్రయోగిస్తున్నారని ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారు. తాను ఇటువంటి నోటీసుల‌కు భ‌య‌ప‌డేది లేద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement