Thursday, October 17, 2024

America – సంకల్ప బలమే ప్రధానం – రేవంత్

ఆంధ్రప్రభ స్మార్ట్ – న్యూయార్క్ – జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా, లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్ప బలం మనలో ఉండటం ప్రధానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న సిఎం న్యూయార్క్‌ నగరంలో భారత అంధుల క్రికెట్ జట్టు క్రీడాకారులను కలుసుకున్నారు.

వారిని కలుసుకున్న సందర్భం తనకు లభించిన ఒక అమూల్యమైన అవకాశంగా భావిస్తున్నానని అన్నారు. వారితో ఆప్యాయంగా కొద్దిసేపు ముచ్చటించారు. జీవితంలో ఎలాంటి సవాళ్లయినా ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని వారి నుంచి నేర్చుకోగలమన్నారు. వారిలోని స్పూర్తిని అభినందిస్తూ వారికి ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.

.

Advertisement

తాజా వార్తలు

Advertisement