అంబర్ పేట – అంబర్ పేట్ డివిజన్ అలీ కేఫ్ వాటర్ వర్క్స్ వెనుక ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న ముస్లిం గ్రేవీ యార్డ్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ ని నేడు కలిసి వినతి పత్రం అందజేశారు బిఆర్ఎస్ నాయకులు పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి జాఫర్, హైమద్ నగర్ సొసైటీ సభ్యులు . ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సహకారంతో వీలైనంత త్వరగా పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు లవంగు ఆంజనేయులు,డివిజన్ ప్రధాన కార్యదర్శి జాఫర్,మోసిన్,షేక్ రఫీక్, హైమద్,హైమత్ నగర్ సొసైటీ ప్రెసిడెంట్ అజార్,వైస్ ప్రెసిడెంట్ షేక్ శంషుద్దీన్, మజీద్ ఇంచార్జ్ హర్షద్, యూనుస్,అర్భాజ్ తదితరులు పాల్గొన్నారు.