హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు సమక్షంలో చిన్నబోయిన శంకర్ ముదిరాజ్ (అంబర్ పేట శంకర్) రాఘవేంద్ర ముదిరాజ్, సాయికిరణ్ ముదిరాజ్, రమణ, నజయ్ ముదిరాజ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు శంకర్, ఇతరులకు కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ని భారీ మెజారిటీతో గెలిపించుకుని, అంబర్ పేట గడ్డపై మరోసారి బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తామని ఈ సందర్భంగా శంకర్ తెలియజేశారు.