Friday, November 22, 2024

టాన్స్ జెండర్లకు ఉద్యోగాలు.. కరీంనగర్ పోలీసులకు కృతజ్ఞతలు

కరీంనగర్ – సమాజంలో వివక్షకు గురవుతున్న ట్రాన్స్ జెండర్లకు కరీంనగర్ పోలీసులు మల్టీ నేషనల్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో కరీంనగర్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో 1026 మందికి మల్టీ నేషనల్ కంపెనీలలో ఉద్యోగాలు దక్కాయి.జాబ్ మేళాలో 10 మంది ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగ అవకాశాలు అమెజాన్ కంపెనీ కల్పించింది. నెలకు 30వేల రూపాయల వేతనంతో వారు ఉద్యోగ అవకాశాలను పొందారు.ఎక్కడ లేని విధంగా ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు ట్రాన్స్ జెండర్లు కరీంనగర్ సిపి సుబ్బారాయుడు కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఒక దశలోఅట్టి ఉద్యోగ పత్రాన్ని ఒక ట్రాన్స్ జెండర్ తీసుకుంటూ సంతోషంలో ఉద్వేగానికి గురయ్యారు. నియామకపు పత్రాలను ప్రణాళిక బోర్డు చైర్మన్ వినోద్ కుమార్, జిల్లా కలెక్టర్ కర్ణన్, సిపి సుబ్బారాయుడు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement