Friday, November 22, 2024

Amaranath Tour – సుర‌క్షితంగా బైంసా అమర్నాథ్ యాత్రీకుల బృందం

కొండ చరియలు విరిగిపడటంతో మార్గమధ్యంలో నిలిచిన ప్రయాణం
సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లిన సీఆర్పీఎఫ్ జవాన్లు
ఆర్మీ బేస్ క్యాంపులో సేదతీరుతున్న యాత్రీకులు…

నిర్మల్ జిల్లా – బైంసా.. వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్ర ప్రమాదకరంగా మారి నిలిచిపోయింది. జమ్ము – శ్రీనగర్ హైవే లో కొండ చరియలు విరిగిపడి పలు ప్రాంతా ల్లో అమర్నాద్ యాత్రీకులు చిక్కుకుపోయారు. ఇందులో భాగంగానే రెవెన్యూ డివిజన్ కేంద్రమైన భైంసా నుంచి అమర్నాథ్ యాత్రకు వెళ్లిన యాత్రీకుల బృందం సమస్యలను ఎదుర్కొంది. మార్గమధ్యంలో చిక్కుకున్న వారిని సీఆర్పీఎఫ్ జవాన్ల బృందం సురక్షితంగా రక్షించి తమ బేస్ క్యాంపుకు తరలించారు.

వివ‌రాల‌లోకి వెళితే .. ఐదు రోజులు క్రితం భైంసా పట్టణానికి చెందిన 10 కుటుంబాలు అమర్నాథ్ యాత్రకు తరలివెళ్లాయి. అయితే యాత్ర కొనసాగే జమ్ము – శ్రీనగర్ హైవే మార్గంలో భారీ వర్షాలు కురియడంతో కొండ చరియలు విరిగి పడటంతో బైంసా యాత్రీకుల బృందం చిక్కుకుపోయింది . అక్కడి మార్గంలోని సీఆర్పీఎఫ్ జవాన్లు వారిని సురక్షితంగా రక్షించి బల్తాల్ బేస్ క్యాంపుకు తీసుకవెళ్లి వసతి కల్పించినట్లుగా బృందం ప్రతినిధులు గుజ్జల్వార్ వెంకటేష్, రవీందర్ రెడ్డి కళ్యాణ్, సచిన్ లు తెలిపారు. రెండు రోజులుగా తాము ఆర్మీ బేస్ క్యాంపులో వారి రక్షణలో సేద తీరుతున్నామని తెలిపారు. ఆర్మీ జవాన్లు తమను వారి కుటుంబ సభ్యులుగా ఆదరిస్తూ సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement