కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన నిధుల కోసం కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు అండగా నిలబడతారని చెప్పారు. హైదరాబాద్ అల్వాల్‌లో హైదరాబాద్-రామగుండం ఎలివేటెడ్ కారిడార్ పనులకు సీఎం భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ. ఆర్ఆర్ఆర్ గురించి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ కు అంతర్జాతీయ స్థాయి తెచ్చారని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు కాంగ్రెస్ హయాంలో వచ్చిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం కేంద్రంతో బీఆర్ఎస్ సర్కార్ గిల్లి కజ్జాలు పెట్టిందని విమర్శించారు. తాము అభివృద్ధి కోసం ఏదైనా చేస్తామని చెప్పారు. కేంద్రంతో ఘర్షణ వాతావరణం మంచిది కాదని ప్రధానితో పాటు రక్షణ శాఖ మంత్రిని కలిశామని తెలిపారు. అభివృద్ధి కోసం మెట్టు దిగడంలో తప్పు లేదని రేవంత్ రెడ్డి తెలిపారు.
పదేళ్లలో డ్రగ్స్… పబ్స్ గబ్బే..
బీఆర్ఎస్ హయాంలో పబ్బులు, గంజాయి, డ్రగ్స్ వచ్చాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రయోజనాల కొట్లాడుతామని అన్నారు. మెట్రో ఫేజ్ 2కు నిధుల కోసం సహాయం అడుగుతామని తెలిపారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు ఎన్నికలు ముగిసాక అభివృద్ది తమ నినాధమని వంత్ రెడ్డి అన్నారు.