హైదరాబాద్ – అసెంబ్లీలో బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రవేశపెట్టారు.. అలాగే మండలిలో మంత్రి ప్రశాంతరెడ్డి ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 2,90,396 కోట్లతో బడ్జెట్ ను ప్రతిపాదించారు.. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు కాగా,పెట్టుబడి వ్యయం రూ. 37,525 కోట్లు గా చూపారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి 26,831 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా నీటిపారుదల శాఖకు రూ. 26,885 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, విద్యుత్ రంగానికి రూ. 12,727 కోట్లు కేటాయించింది. విద్యా రంగానికి రూ. 19,093 కోట్లు .. వైద్య రంగానికి రూ. 12,161 కోట్లు కేటాయించారు.
పరిశ్రమలకు రూ. 4,037 కోట్లు మూసీ అభివృద్ధి కోసం రూ. 200 కోట్లు దళితబందుకు రూ.17,700 కోట్లు కేటాయించారు.
అంతకు ముందు హరీష్ రావు బడ్జెట్ ప్రతులతో జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది, అర్చకులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం హరీష్ రావు అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు . బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్ కు మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి పాదభివందనం చేసి ఆశిస్సులు తీసుకున్నారు.అనంతరం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కు మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రతులను అందజేశారు.
2023 – 24 బడ్జెట్ 2,90,396 కోట్లు..
తెలంగాణ బడ్జెట్‌ను మంత్రి హరీష్ రావు 2023 – 24 బడ్జెట్ 2,90,396 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
తెలంగాణ 2023 – 24 వార్షిక బడ్జెట్ 2,90,396 కోట్లు. రెవెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు. పెట్టుబడి వ్యయం రూ. 37,525 కోట్లు.
తలసరి ఆదాయం3,17,215
మూలధన వ్యయం 37, 525 కోట్లు
బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి భారీగా కేటాయింపులు..
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి 26,831 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా నీటిపారుదల శాఖకు రూ. 26,885 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, విద్యుత్ రంగానికి రూ. 12,727 కోట్లు కేటాయించింది..
విద్య, విద్య రంగాలకు ప్రాధాన్యం..
వైద్యం, విద్య రంగాలకు మంత్రి హరీష్ రావు బడ్జెట్‌లో ప్రాధాన్యత కల్పించారు.
విద్యా రంగానికి రూ. 19,093 కోట్లు ..
వైద్య రంగానికి రూ. 12,161 కోట్లు కేటాయించారు.
పరిశ్రమలకు రూ. 4,037 కోట్లు
మూసీ అభివృద్ధి కోసం రూ. 200 కోట్లు
రవాణాశాఖకు రూ. 1,644 కోట్లు
గిరిజన సంక్షేమానికి రూ. 3,965 కోట్లు
పరిశ్రమలకు రూ. 4,037 కోట్లు
గ్రామాల్లో రోడ్ల కోసం రూ. 2 వేల కోట్లు
హరితహారానికి రూ. 14 వేల 71 కోట్లు
మైనారిటీ సంక్షేమానికి రూ. 2 వేల 200 కోట్లు
విద్యారంగానికి రూ.19వేల 093 కోట్లు
ఇరిగేషన్ రంగానికి రూ. 26వేల 885 కోట్లు
షెడ్యూల్ తెగలకు రూ.15, 233 కోట్లు
బీసీ సంక్షేమం కోసం రూ. 6,229 కోట్లు
దళితబంధుకు రూ. 17 వేల 700 కోట్లు
ఆసరా పెన్షన్లకు రూ.12 వేల కోట్లు
విద్యుత్ రంగానికి రూ.12, 727 కోట్లు
ప్రజాపంపిణీ రంగానికి రూ. 3117 కోట్లు