అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి
ఆరుగురి అరెస్ట్.. జడ్జి ముందు హాజరు
అందరికీ బెయిల్ మంజూరు
హైదరాబాద్ – సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి, శ్రీతేజ కుటుంబానికి న్యాయం చేయడంలో అల్లు అర్జున్ విఫలం అయ్యారని ఓయూ జేఏసీ నాయకులు గత సాయంత్రం అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించారు. ఈ తరుణంలో అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన నిరసనకారులు ఆయన ఇంటి ఆవరణలో పలు వస్తువులను ధ్వంసం చేశారు. ఈ దాడి పై వెంటనే స్పందించిన పోలీసులు ఆరుగురు జేఏసీ నేతలను అదుపులోకి తీసుకున్నారు.
దాడి చేసిన రెడ్డి శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేష్, ప్రేమ్ కుమార్, ప్రకాశ్ లపై బీఎస్ 331(5), 190, 191(2), 324(2), 292, 126(2), 131 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను వనస్థలిపురంలోని న్యాయమూర్తి నివాసంలో హాజరపరిచారు.. కేసును పరిశీలించిన న్యాయమూర్తి ఆ ఆరుగురికి జడ్జీ బెయిల్ మంజూరు చేశారు. రూ.10వేలు డిపాజిట్ తో పాటు రెండు షూరిటీలను సమర్పించాలని ఆదేశించారు. మూడు రోజులలో దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు.