హైదరాబాద్: సినీనటుడు అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. ప్రతి ఆదివారం పీఎస్ లో హాజరు కావాలన్న నిబంధన నుంచి న్యాయస్థానం ఆయనకు మినహాయింపు ఇచ్చింది. బెయిల్ మంజూరు సమయంలో ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరుకావాలని గతంలో కోర్టు షరతులు విధించింది.
ఈక్రమంలో భద్రతా కారణాల దృష్ట్యా మినహాయింపు ఇవ్వాలని అల్లు అర్జున్ కోరారు. దీంతో కోర్టు ఆయనకు మినహాయింపు ఇచ్చింది. అల్లు అర్జున్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.