Friday, December 13, 2024

TG | పోలీసుల‌పై అల్లు అర్జున్ అస‌హ‌నం..

హైద‌రాబాద్ : చిక్క‌డ‌ప‌ల్లి పోలీసుల అరెస్ట్‌ చేసే సమయంలో అల్లు అర్జున్ నివాసం దగ్గర హైడ్రామా కొనసాగింది. పోలీసుల తీరుపై అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేశాడు. పోలీసులు తనను తీసుకెళ్లడంలో అభ్యంతరం లేదన్న అల్లు అర్జున్‌ ఉన్న పళంగా తమతో రావాలంటే ఎలా..? దుస్తులు మార్చుకునేందుకు అవకాశం కూడా ఇవ్వరా..? అంటూ ప్రశ్నించారు. దీంతో పోలీసులు అల్లు అర్జున్‌ బెడ్‌రూం వరకు వెళ్లి డ్రస్ మార్పించి టీ షర్ట్‌, షార్ట్‌లో పీఎస్‌కు తీసుకెళ్లారు.

పోలీస్ వాహ‌నంలో తండ్రి .. వ‌ద్ద‌ని వారించిన ఐకాన్ స్టార్
కాగా, అల్లు అర్జున్‌తోపాటు తండ్రి అల్లు అరవింద్‌ కూడా వాహనం ఎక్కాడు. అయితే తండ్రిని వాహనం ఎక్కొద్దంటూ వారించి కిందికి దించేశాడు. ఏం జరిగినా మంచైనా చెడైనా అంతా నాదేనంటూ చెప్పాడు. పోలీసుల రాక నేపథ్యంలో బన్నీ సతీమణి స్నేహారెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో ఆమెను దగ్గరకు తీసుకొని ధైర్యం చెప్పాడు అల్లు అర్జున్‌. ఇక వేరే కారులో అల్లు అర‌వింద్, అల్లు శీరిష్ లు చిక్క‌డప‌ల్లి పోలీస్ స్టేష‌న్ కు వెళ్లారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement