Friday, November 22, 2024

Education | మూడో విడత డిగ్రీసీట్ల కేటాయింపు పూర్తి.. విద్యార్థుల్లో కామర్స్ కోర్స్ పై త‌గ్గ‌ని డిమాండ్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన దోస్త్‌ మూడో విడత సీట్లను అధికారులు కేటాయించారు. రెండో విడతలో మొత్తం 49,267 మందికి సీట్లను ఇప్పటికే కేటాయించగా, మూడో విడతలో 72,949 మందికి సీట్లను గురువారం కేటాయించినట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మూడో విడత సీట్ల కేటాయింపులోనూ ఆర్ట్స్‌ కోర్సుకు ఆదరణ కరువైంది. ఆర్ట్స్‌ కోర్సును ఎంచుకున్నవారు 10,939 మంది ఉన్నారు. కామర్స్‌కు మొదటి, రెండో, మూడో విడతల్లోనూ ఏమాత్రం డిమాండ్‌ తగ్గలేదు. మూడో విడత సీట్ల కేటాయింపుల్లో 32,209 మంది కామర్స్‌ కోర్సును ఎంచుకున్నారు.

- Advertisement -

ఇక లైఫ్‌ సైన్స్‌ కోర్సును 16,859 మంది ఎంపిక చేసుకున్నారు. ఫిజికల్‌ సైన్సెస్‌ కోర్సును 12,620 మంది ఎంచుకున్నారు. డిఫార్మసీ సీట్లు పొందిన వారు కేవలం 235 మంది మాత్రమే ఉన్నారు. ఇతర కోర్సులను ఎంచుకున్న వారు 87 మంది ఉండగా, మూడో విడతలో మొత్తం సీట్లు పొందిన అభ్యర్థులు 72,949 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మొదటి విడతలో 73,220, రెండో విడతలో 49,267, మూడో విడతలో 72949 మందికి సీట్లు కేటాయించారు. మొత్తంగా 1,95,436 మంది ఉన్నారు. అయితే వీరిలో మొదటి విడతలో సీటు పొందిన వారు..

రెండో విడతకు, రెండో విడతలో సీటు పొందిన వారు మూడో విడత కౌన్సెలింగ్‌లో ఉత్తమ కాలేజీ, కోర్సు కోసం కౌన్సెలింగ్‌లో పాల్గొంటూ ఉంటారు. ఈ క్రమంలో మొత్తం ఎన్ని సీట్లు భర్తీ అయినాయి తెలియాలంటే తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తి కావాల్సి ఉంది. స్పెషల్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌ ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానుంది. సీట్ల కేటాయింపు ఆగస్టు 16న కేటాయించనున్నారు. మూడో విడతలో సీటు పొందిన అభ్యర్థులు ఈనెల 22 నుండి 25 వరకు సంబంధిత కాలేజీలకు వెల్ళి రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement