Sunday, November 24, 2024

ఇంజనీరింగ్‌ రెండో దశ సీట్లు కేటాయింపు.. 21వేల సీట్లు భర్తీ, మరో 14 వేల సీట్లు మిగులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఎంసెట్‌ రెండో దశ కౌన్సెలింగ్‌ సీట్ల కేటాయింపును అధికారులు చేపట్టారు. రెండో విడతలో మొత్తం 21,136 సీట్లను అభ్యర్థులకు కేటాయించారు. ఇంకా 14,202 సీట్లు మిగిలాయి. రాష్ట్రంలో మొత్తం కన్వీనర్‌ సీట్లు 78,336 ఉండగా, వాటిలో మొదటి విడతలో 42,998 సీట్లు భర్తీ చేసిన విషయం తెలిసిందే. రెండో విడత కౌన్సెలింగ్‌లో ఖాళీ ఉన్న 35,338 సీట్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించగా 21,136 సీట్లు భర్తీ అయ్యాయి. రెండు విడతల్లో కలుపుకొని రాష్ట్రంలోని 177 ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీల్లో మొత్తం 78,338 కన్వీనర్‌ కోటా సీట్లల్లో 64,134 (81.87) సీట్లు భర్తీ అయ్యాయి. రెండో దశ కౌన్సెలింగ్‌లో 4590 మంది అభ్యర్థులు ఆప్షన్లు ఇచ్చుకున్నప్పటికీ వారు సీటు పొందలేకపోయారు.

ఈడబ్ల్యూఎస్‌ కోటాలో 5265 మంది సీట్లు పొందారు. 177 కాలేజీల్లో 33 కాలేజీల్లోని (ఒకటి వర్సిటీ, 32 ప్రైవేట్‌ కాలేజీల్లో) 100 శాతం సీట్లు నిండాయి. సీటు పొందిన అభ్యర్థులు ఈనెల 18వ తేదీలోపు సంబంధిత కాలేజీల్లో సెల్ఫ్‌ ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని అధికారులు సూచించారు. మిగిలిన సీట్లకు ఫైనల్‌ ఫేజ్‌లో భర్తీ చేయనున్నారు. కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ సంబంధిత కోర్సుల్లో అత్యధికంగా 94.44 శాతం సీట్లు భర్తీ అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement