హైదరాబాద్ – కేంద్రం ఆర్ధిక మంత్రి సీతారామన్ ఇటీవల ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులు కనిపించలేదు… ప్రత్యేకంగా తెలంగాణకు ఎటువంటి గ్రాంట్స్, గానీ నిధులు గాని ఇస్తున్నట్లు పేర్కొనలేదు.. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేసీఆర్ సీరియస్ కామెంట్స్ చేశారు.
ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్) వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్ పెట్టారు. తెలంగాణకు కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బీజేపీని ప్రశ్నించడానికి ఎందుకు భయపడుతున్నారని అడిగారు. తెలంగాణ ప్రాజెక్టులు అన్యాయంగా కృష్ణా బోర్డు కి అప్పగింతపై ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.. కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రయోనాలు తాకట్టు పెడతారా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా, మొత్తం కేంద్ర ప్రభుత్వం రూ.47,65,768 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే తెలంగాణ ఒక్కపైసా కేటాయింపు లేకపోవడంపై సీఎం రేవంత్ ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు.