Tuesday, November 26, 2024

టీఎస్ ఐసెట్ సీట్ల కెటాయింపు.. ఎంబీఏకు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చిన స్టూడెంట్స్..

హైదరాబాద్‌, (ప్ర‌భ‌న్యూస్) : టీఎస్ ఐఎసెట్‌ తొలి దశ సీట్ల కేటాయింపు ఆదివారం జరిగింది. ఎంబీఏ, ఎంసీఏ సీట్లకు సంబంధించిన సీట్లను విద్యార్థులకు అధికారులు కేటాయించారు. ఎంసీఏ కోర్సు కన్నా ఎంబీఏ కోర్సుకే ఎక్కువ మంది ప్రాధాన్యం ఇచ్చి అందులో సీట్లు పొందారు. అది కూడా ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లోనే సీట్లను పొందారు. ప్రభుత్వ కాలేజీల్లో ఎంబీఏ సీట్లు 89.26 శాతం భర్తీ కాగా, ఎంసీఏలో 97.88 శాతం భర్తీ అయ్యాయి.

ఇక ప్రైవేట్‌ కాలేజీల్లో ఎంబీఏ సీట్లు 67.55 శాతం నిండగా, ఎంసీఏ సీట్లు 98.27 శాతం భర్తీ అయ్యాయి. ప్రభుత్వ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ సీట్లు సగటున చూసుకుంటే 93.57 శాతం భర్తీకాగా, ప్రైవేట్‌లో మాత్రం 82.91 శాతం నిండాయి. ఐసెట్‌-2021లో మొత్తం 51,316 మంది అర్హత సాధించగా 22416 మంది సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కలుపుకుని మొత్తం 272 కళాశాలలు ఉండగా, అందులో 26,845 సీట్లుండగా వాటిలో 19,209 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 7636 సీట్లు ఖాళీగా మిగి లాయి. 28 కాలేజీల్లో మొత్తం 100 శాతం సీట్లు నిండాయి.

తొలి దశ ఐసెట్‌ సీట్ల కేటాయింపుల్లో సీటు పొందిన అభ్యర్థులు ఈనెల 18వ తేదీలోగా సంబంధిత కాలేజీల్లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలి. సీట్లు పొందిన విద్యార్థులంతా అలాట్‌మెంట్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకొని, డెబిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డు, నెట్‌ బ్యాంకింగ్‌ల ద్వారా ట్యూషన్‌ ఫీజును ఆ తేదీ లోగా చెల్లించాలి. సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 27 నుంచి 29 మధ్య జరిగే ఫైనల్‌ ఫేజ్‌ తర్వాత నేరుగా కళాశాలకు వెళ్లి రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement