Wednesday, November 20, 2024

TG | అభివృద్ధికి నిధులు కేటాయించండి.. సీఎంను కోరిన ఎమ్మెల్యే గూడెం

పటాన్ చెరు : శరవేగంగా అభివృద్ధి చెందిన పటాన్ చెరువు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలని, గత ప్రభుత్వ హాయాంలో మంజూరైన రెవెన్యూ డివిజన్, పాలిటెక్నిక్ కళాశాల, రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ఏర్పాటు చేయడంతో పాటు తగిన సిబ్బందిని కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

మంగళవారం హైదరాబాద్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలను వివరించడంతో పాటు చేపట్టబోయే పనుల వివరాలను నివేదిక రూపంలో అందించారు. రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలో నూతన కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు ఏర్పాటవుతుండడంతో ఇందుకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన చేయాల్సి వస్తోందని తెలిపారు. అభివృద్ధి పనులకు అనుగుణంగా నిధులు కేటాయించాలని కోరారు.

నియోజకవర్గానికి మంజూరైన రిజిస్ట్రేషన్ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయం, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటున‌కు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యాలయాలకు సంబంధించి స్థలాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రిజిస్ట్రేషన్లు, ఆర్డీఓ కార్యాలయం పనుల కోసం నిత్యం పటాన్ చెరు ప్రజలు జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. అతి త్వరలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement