Tuesday, November 26, 2024

Alliance Talk – బిఆర్ఎస్ తో పొత్తు … దాట‌వేసిన సిపిఐ కార్య‌దర్శి కూనంనేని

క‌రీంన‌గ‌ర్ – బి ఆర్ ఎస్ తో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపై సి పి ఇ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివ రావు క్లారిటీ ఇవ్వలేకపోయారు. కరీంనగర్ బద్దం ఎల్లారెడ్డి భవన్ లో ఉమ్మడి జిల్లా పార్టీ శిక్షణ తరగతుల్లో పాల్గొనేంకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ మునుగొడులో త‌మ అంద‌తోనే బి ఆర్ ఎస్ గెలిచింది అని చెపుతూనే కలసి ఉన్నాం కానీ రానున్న ఎన్నికల్లో పొత్తు. పై నిర్ణయం తీసుకోలేదని చెప్పారు ..

వాప‌ప‌క్షాలుగా మేము మేముగా ఉంటామని దాటవేశారు. కేంద్రంలో మూడవ ఫ్రంట్ ఉండదని, వద్దని యుపిఎ తో కలసి ఒక తాటి పైకి ప్రతి పక్షాలు రానున్నాయని, ఎన్ డి ఏ ను ఓడించడానికి ఇది అవసరమని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement