Wednesday, November 20, 2024

Alliance in Telangana – ఢిల్లీలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ….పొత్తుల‌పై అమిత్ షా, న‌డ్డాలతో చ‌ర్చించ‌నున్న జ‌న‌సేనాని

న్యూఢిల్లీ – తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతుంటంతో భారతీయ జనతాపార్టీ స్పీడు పెంచింది. జనసేనతో పొత్తు విషయంపై తేల్చేందుకు బీజేపీ సిద్ధమైంది. అయితే, ఎవరికెన్ని సీట్లు అనేది తెలియాల్సి ఉందని ఇరుపార్టీల్లో టాక్ వినిపిస్తోంది. అయితే, జనసేన, బీజేపీ పొత్తుకు తుది రూపు ఇచ్చేందుకు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవనున్నారు. ఈ భేటీ కోసం ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరారు. పవన్‌ వెంట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి కూడా ఉన్నారు.

పొత్తులో భాగంగా ఏపీతో సరిహద్దు ఉన్న నియోజకవర్గాలను జనసేనకు కేటాయించే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ భేటిలో జనసేన నేతలు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ పాల్గొననున్నారు. బీజేపీతో పొత్తుకు జనసేన సిద్ధమైందని.. అయితే సీట్ల విషయంపై చర్చించనున్నట్లు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని లక్ష్మణ్‌ అన్నారు. ఈ విషయంలో రెండు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చాయని తెలిపారు. ఎన్ని సీట్లు అన్నది త్వరలోనే నిర్ణయిస్తామని లక్ష్మణ్‌ ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement