Saturday, January 4, 2025

All Set – రేపటి నుంచే తెలంగాణ టెట్ … అన్ని ఏర్పాట్లు పూర్తి ..

ప‌రీక్ష రాయ‌నున్న 2.75 ల‌క్ష‌ల మంది అభ్య‌ర్ధులు
20వ తేది వ‌ర‌కు 20 సెష‌న్ ల‌లో ఎగ్జామ్స్
రోజుకి రెండు ప‌రీక్ష‌లు..
ఆన్ లైన్ లో హాల్ టికెట్స్
ఒక నిమిషం నిబంధ‌న అమ‌లు

హైద‌రాబాద్ : టీజీ టెట్ – 2024 అర్హ‌త ప‌రీక్ష‌లు రేప‌టి నుంచి నిర్వ‌హించ‌నున్నారు.. ఈ ప‌రీక్ష‌లు ఈ నెల 20 వ‌ర‌కు కొనసాగ‌నున్నాయి. ఈ ప‌రీక్ష‌ల‌ను కంప్యూట‌ర్ బేస్డ్ విధానంలో జ‌ర‌గ‌నున్నాయి. టెట్ ప‌రీక్ష‌ల‌కు 2.75 ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. టెట్ హాల్ టికెట్లు https://tgtet2024.aptonline.in/tgtet/ అనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

- Advertisement -

జ‌న‌వ‌రి 2వ తేదీ నుంచి 20వ తేదీ వ‌ర‌కు ప‌ది రోజుల పాటు 20 సెష‌న్ల‌లో ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ప్ర‌తి రోజు రెండు సెష‌న్లు అంటే సెష‌న్ – 1 ఉద‌యం 9 గంట‌ల నుంచి 11.30 గంట‌ల వ‌ర‌కు, సెష‌న్ -2 మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి 4.30 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. పేప‌ర్-1 ప‌రీక్ష‌ల‌ను జ‌న‌వ‌రి 8, 9, 10, 18 తేదీల్లో నిర్వ‌హించ‌నున్నారు. పేప‌ర్ -2 ప‌రీక్ష‌ల‌ను జ‌న‌వ‌రి 2, 5, 11, 12, 19, 20వ తేదీల్లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు.

అభ్య‌ర్థులు పాటించాల్సిన నిబంధ‌న‌లు ఇవే..

ఉద‌యం సెష‌న్‌కు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థుల‌ను ఉద‌యం 7.30 నుంచి ప‌రీక్షా కేంద్రాల్లోకి అనుమ‌తించ‌నున్నారు. మ‌ధ్యాహ్నం సెష‌న్‌కు హాజ‌ర‌య్యే వారిని మ‌. 12.30 గంట‌ల నుంచి అనుమ‌తించ‌నున్నారు. ఇక ప‌రీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే ప‌రీక్షా కేంద్రం గేట్ల‌ను క్లోజ్ చేయ‌నున్నారు. అంటే ఉద‌యం సెష‌న్‌లో ఉ. 8.45కు, మ‌ధ్యాహ్నం సెష‌న్‌లో 1.45 గంట‌ల‌కు గేట్ల‌ను మూసివేయ‌నున్నారు. డోర్స్ క్లోజ్ చేసిన త‌ర్వాత నిమిషం ఆల‌స్యంగా వ‌చ్చినా కేంద్రాల‌లోకి అనుమ‌తించరు. అభ్య‌ర్థులు త‌ప్ప‌నిస‌రిగా హాల్ టికెట్‌తో పాటు బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్, గుర్తింపు కార్డు(ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, పాన్ కార్డు, ఓట‌ర్ ఐడీ) తీసుకెళ్లాలి.-స్మార్ట్ వాచీల‌తో పాటు ఎలాంటి ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల‌కు అనుమ‌తి లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement