హనుమాన్ పెద్ద జయంత్యుత్సవాలకు కొండగట్టు ఆం జనేయస్వామి ఆలయం ముస్తాబయ్యింది. ఈ నెల 12 నుంచి స్వామి సన్నిధిలో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల కోసం అంజన్న ఆలయంతో పాటు ఉప ఆలయాలకు రంగులు వేశారు.
దిగువ కొండగట్టు, దొంగలమర్రి-జేఎన్‌టీయూ మార్గంలో, కొండపైన స్వాగత తోరణా లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతియేటా నిర్వహించే హనుమాన్ పెద్ద జయం తిని ఆదివారం వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధి కారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మూడు రోజులపాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి లక్షలాదిగా అంజన్నదీ క్షాపరులు, భక్తులు కొండగట్టుకు చేరుకోనున్నారు. ఆలయానికి లైటింగ్ పనులు పూర్తి అయ్యాయి. ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే అన్ని పనులు పూర్తి అయ్యాయి.
పర్యవేక్షణకు అధికారుల నియామకం
కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో ఈ నెల 12 నుంచి 14వరకు కొనసాగే ఉత్సవాలకు గాను భక్తులకు ఇక్కట్లు కలుగకుండా చిన్న జయంతికి ఏర్పాటు చేసినట్లుగానే ఎక్కడిక్కడ పర్యవేక్షణకు కలెక్టర్ శ
షేక్ యాస్మిన్ బాష విభాగాలుగా ఏర్పాటు చేసి అధికారులను నియమించారు. కొండ పైకి వచ్చే భక్తులు అసౌకర్యానికి గురి కాకుండా వివిధ శాఖల అధికారులు, ఎంపీడీవో, ఎంపీవోలతో ఇన్‌చార్జీ, కోఆర్డినేటింగ్ ఇన్‌చార్జీలను నియమించారు. ప్రధాన ఆలయం, క్యూలైన్, కొత్త, పాత కోనేరుల వద్ద ఏర్పాట్లు, అన్న దానం, కేశఖండనం, దీక్షమండపం, బేతాళస్వామి ఆలయం, దేవస్థానం కార్యాలయం, సానా గెస్ట్‌హౌజ్, పార్కింగ్ ఏరియాలు, మెడికల్ క్యాంప్, వా టర్ పాయింట్స్, వలంటీర్లకు సౌకర్యాలు, రవాణ, విద్యుత్, అగ్నిమాపక, రూట్‌మ్యాప్, బందోబస్తు, పారిశుధ్య తదితర వాటిని విభాగాలుగా చేశారు. ఎంపీడీవో, ఎంపీవో, తహసీల్దార్లు ఇన్‌చార్జీలుగా వారికి ఆర్డీవోలు, జిల్లా స్థా యి అధికారులు కోఆర్డినేటింగ్ ఇన్‌చార్జీలుగా నియమించారు.