Thursday, December 19, 2024

KHM | సెకండ్ ఏఎన్ఎంలందరినీ రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేయాలి..

ఖమ్మం : వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న రెండవ ఏఎన్ఎంలందరినీ రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేయాలని, తెలంగాణ ఆరోగ్య సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు ఖమ్మం జిల్లా సమీకృత కలెక్టరేట్ నందు 48గంటల నిరసన దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ వైద్య అండ్ ప్రజా ఆరోగ్య ఉద్యోగుల సంఘం హెచ్1 ఐఎన్టియుసి యూనియన్ అండ్ సిఐటియు సెకండ్ ఏఎన్ఎం అసోసియేషన్ తదితర యూనియన్లు పాల్గొని నిరసనను వ్యక్తం చేశారు.

ఎన్నికల సందర్భంగా ఏఎన్ఎంలను రెగ్యులర్ చేస్తామని మాట ఇచ్చి మళ్లీ ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్ష నిర్వహించడం అనేది ఏఎన్ఎంలకు అన్యాయం జరుగుతుంది. అంతేకాకుండా జనాభా ప్రాతిపదికన పోస్టులను పెంచి వారి అందరినీ యధావిధిగా రెగ్యులర్ చేయాలని ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ వన్ యూనియన్ జిల్లా అధ్యక్షులు వి.కృష్ణారావు, సెక్రటరీ ఎన్.సందీప్, సిఐటియు జిల్లా అధ్యక్షులు బి.వేణుగోపాల్, సెక్రటరీ కొండల్, అసోసియేషన్ సభ్యులు విజయ్ కుమారి, వసంత, నరసమ్మ, శ్రీలత, అభేదా, నర్సు బాయ్, పద్మావతి, రేణుక, నాగమణి, సునీత, మదారమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement