ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వలసకూలీ లకు అన్ని సౌకర్యాలు కల్పించాలని పెద్దపల్లి ఇన్చార్జ్ డిసిపి అఖిల్ మహాజన్ సూచించారు. శుక్రవారం పెద్దపల్లి మండలం లోని గౌరెడ్డిపేట లో గల ఇటుక బట్టీల ను తనిఖీ చేసి వలసకూలీల తో మాట్లాడారు. అనంతరం బసంత్ నగర్ పోలీస్ స్టేషన్లో బట్టి యజమానులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ పొట్టకూటి కోసం వలస కూలీలు ఇతర రాష్ట్రాల నుండి వచ్చారని వారి భద్రత బట్టి యజమానులదే అన్నారు.
బట్టిల లో కూలీల చేత వెట్టిచాకిరి చేయించ వద్దని, కార్మిక చట్టాలు కచ్చితంగా పాటించాలన్నారు. కూలీలకు బట్టీల వద్ద మౌలిక వసతులు కల్పించాలని ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా చూడాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి, సిఐ ప్రదీప్ కుమార్, ఎస్సైలు రాజేష్, మహేందర్, శివాని లతో పాటు ఇటుక బట్టి యజమానులు పాల్గొన్నారు.