Sunday, November 24, 2024

అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కెసిఆర్ లక్ష్యం… హ‌రీష్ రావు

సంగారెడ్డి, ఆగష్టు 12 (ప్రభ న్యూస్): అన్ని వర్గాల సంక్షేమం సీఎం కెసిఆర్ లక్ష్యం అని మంత్రి హ‌రీష్ రావు అన్నారు.. సంగారెడ్డి నియోజకవర్గంలో బీసీ బంధు ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి హరీశ్ రావు హాజరై 300 మంది లబ్ధిదారులకు లక్ష రూపాయల చెక్కుల పంపిణీ చేసారు. అనంతరం ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీలను రెగ్యులరైజ్ చేస్తూ ఉద్యోగ నియామక పత్రాలను అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైదాపూర్, గంగాపూర్, మారేపల్లి గ్రామాలకు సంబంధించిన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల ప్రొసీడింగ్స్ అందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ నెల 14 నుంచి లక్ష లోపు ఉన్న రైతుల రుణమాఫీ చేస్తామని కీలక ప్రకటన చేశారు.

సోమవారం నాడు లక్ష లోపు రుణం తీసుకున్న రైతుల రుణమాఫీ చేస్తామని లక్ష రూపాయల పైన తీసుకున్న రుణాలను మరో 15 నుంచి 20 రోజుల్లో మాఫీ చేస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ వల్ల పరిస్థితి ఆగమాగం ఉంది వాళ్ళకి దిక్కు లేకుండా అయిపోయిందని. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 3 గంటలు కరెంట్ ఇస్తే మూడెకరాల పొలం పారుతుంది అన్నాడని, అటువంటి ఆయనకి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని చురకలు అంటించారు. పంచాయతీ సెక్రెటరీ, విఆర్ఎలు, రేషన్ డీలర్లు, ఆర్టీసీ ఉద్యోగులను రెచ్చగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు యత్నించారని మంత్రి హరీష్ రావు అన్నారు.

ఈ కార్యక్రమములో బీసీ బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, టిఎస్ హెచ్ డిసి చైర్మన్ చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమెల్యే మాణిక్ రావు, జెడ్ పి చైర్మన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్ మాన్ బొంగుల విజయ లక్ష్మి, జిల్లా కలెక్టర్ డా.శరత్, అడిషనల్ కలెక్టర్ చంద్రశేకర్, జిల్లా బిసి అధికారి జగదీశ్, జిల్లా వ్యవసాయ ఆధికారి నరసింహ రెడ్డి, జిల్లా పంచాయితి అధికారి సురేష్ మోహన్, డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివ కుమార్, డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, ఎంపిపి సరళా పుల్లా రెడ్డి, జెడ్పిటిసి మనోహర్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, పంచాయితి కార్యదర్శులు, రైతులు, పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement