Friday, November 22, 2024

హజ్‌ యాత్రకు అన్ని ఏర్పాట్లు, ఈనెల 20 నుంచి ప్రారంభం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పవిత్ర హజ్‌యాత్రకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుందని మైనారిటీ, ఎస్సీ కులాల శాఖ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చెప్పారు. ప్రతి సంవత్సరం హజ్‌యాత్ర ప్రారంభం నుంచి ముగింపు వరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజారు చేస్తుందన్నారు. హజ్‌ యాత్ర ఈనెల 20 నుంచి మొదలై 30వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా బుధవారం హజ్‌ హౌస్‌లో హజ్‌ కమిటీ, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, మహమూద్‌ అలీ, మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎ.కె. ఖాన్‌ నిర్వహించారు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి 3,500 మంది హజ్‌ యాత్రకు వెళ్తున్నారని తెలిపారు.

వారంతా జులై 28వ తేదీ నుంచి ఆగస్టు 6వ తేదీల మధ్య తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారని ఆయన వెల్లడించారు. హజ్‌యాత్రకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి కొప్పుల ఆదేశించారు. హోంమంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ గొప్ప సెక్యూలర్‌ నాయకుడని, మైనారిటీలు ఎలాంటి అభద్రతకు గురికాకుండా ప్రశాంతంగా జీవిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో హజ్‌ కమిటీ చైర్మన్‌ సలీం, ఆంధ్రప్రదేశ్‌ హజ్‌ కమిటీ చైర్మన్‌ షేక్‌ గౌడ్‌, మైనారిటీ, పోలీసు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement