ఎడపల్లి, (ప్రభ న్యూస్): నిజామాబాద్ జిల్లాలోని అలీసాగర్ రిజర్వాయర్ ఎగువ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారుల సూచన మేరకు ఎడపల్లి మండలం అలీసాగర్ ప్రాజెక్టు వరద గేట్లను ఎప్పుడైనా ఎత్తి… వరద నీటిని దిగువకు విడుదల చేస్తామని ఇరిగేషన్ అధికారులు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ మేరకు అలీసాగర్ దిగువ ప్రాంత ప్రజలు, రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ఎడపల్లి మండల రెవిన్యూ, పోలీస్ శాఖ అధికారులు ముందస్తు తగు జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని అలాగే గ్రామాలలో దండోరా వేయించాలని కోరారు. అలీసాగర్ గేట్లను ఏ క్షణాన్నైనా ఎత్తే అవకాశాలు ఉన్నందున వాగు పరివాహక ప్రాంతంలోకి పశువులు,గొర్రెలు మొదలగునవి వెళ్లకుండా అలాగే చేపలు పట్టేవారు, గొర్రెల కాపరులు, రైతులు అటువైపు వెళ్లకుండా అప్రమత్తం గా ఉండాలని ఆమె సూచించారు.