Monday, November 25, 2024

నీట్‌-2022 ఫలితాల్లో అల్ఫోర్స్‌ సంచలనం.. విద్యార్థుల అద్భుతం, మార్కులలో అగ్రస్థానం

కరీంనగర్‌, (ప్రభ న్యూస్‌): నీట్‌ -2022 ఫలితాలలో అల్ఫోర్స్‌ విద్యార్థులు అద్భుత మార్కులతో సంచలనం సృష్టించారు. కళాశాలకు చెందిన దోమల అనుష్క 650 మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది. అలాగే ఎం. రుషిధర్‌ 614 మార్కులు, మహమ్మద్‌ హజ్జా అసద్‌ 571 మార్కులు, జి.అక్షర 563, ఆర్‌.నిఖిల 552, టి . శ్రీఅక్షిత 548, టి. శ్రీవాణి 545, దిల్షాదెమెహజాబిన్‌ 541, ఎన్‌.మెర్లినోజ్యోతి 537, కె.వర్ష 536, ఎం.జ్ఞానద 532, ఎస్‌.శివాత్మిక 529, సయ్యద్‌ అలీ యమిన్‌ 523, వి. రష్మీత 523, సి హెచ్‌. సాత్విక 520, మదీహావాసి 515, యుస్రా ఫాతీమా 508, జి.సాత్విక 503, హెచ్‌. అపూర్వ 499, బి . సహాస్ర 499, బి. వైష్ణవి 496, ఎం. దీక్షితప్రియా 489, ఆర్‌.స్రవంతి 483 మార్కులు సాధించారు.

సుమారుగా 50 మంది విద్యార్థులకు ఎంబీబీఎస్‌ సీటు సాధించేలా మార్కులు తెచ్చుకోవడం అల్ఫోర్స్‌ ప్రత్యేకతగా నిలుస్తోంది. 500, ఆపై మార్కులు 18 మంది విద్యార్థులు, 400, ఆపై మార్కులు 52 మంది విద్యార్థులు సాధించడం విశేషం. అలాగే ఐపిఇలో 468 మార్కులతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవడంతోపాటు- ఐఐటి (మేన్‌)లో 400 మంది, ఆపై విద్యార్థులు అద్భుత మార్కులతో ఐఐటి (అడ్వాన్స్డ్‌)కి అర్హత సాధించారు. పటిష్ట ప్రణాళికతో విద్యాభోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల అకుంటిత దీక్ష పట్టుదల, కృషి వల్ల అల్ఫోర్స్‌ నీట్‌- 2022లో ఇంతటి ఘన విజయం సాధించగలిగామని అల్ఫోర్స్‌ అధినేత డాక్టర్‌ వి. నరేందర్‌రెడ్డి తెలిపారు. ఇంతటి విజయానికి తోడ్పడిన అధ్యాపక, అధ్యాపకేతర బృందంతోపాటు తల్లిదండ్రులను అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement