హైదరాబాద్ – ప్రజా పాలన విజయోత్సవాల ముగింపు వేడుకలు నేడు సచివాలయం వద్ద నిర్వహించనున్నారు. ఈ నేపద్యంలో – నేటి మధ్యాహ్నం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీస్ లు. ఇవాళ రాత్రి వరకు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. నేడు సచివాలయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.ఇవాళ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటలకి అమలులో ఉండనున్నాయి ట్రాఫిక్ ఆంక్షలు.
తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ…
అసెంబ్లీ లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పై సిఎం రేవంత్ ప్రకటన చేస్తారు. సాయంత్రం సచివాలయం లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉంటుంది.లక్ష మంది మహిళల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సభ ఉంటుంది. జయ జయహే తెలంగాణ కవి అందే శ్రీ ..విగ్రహ రూపకర్త ప్రో . గంగాధర్..రమణారెడ్డి లకు వేదిక మీద ప్రభుత్వం తరుపున సన్మానం చేస్తారు. తెలంగాణ లో ప్రజల పక్షం వహించిన ఐదారుగురు కవులకు సత్కరించే ఆలోచన లో ప్రభుత్వం ఉంది.