Monday, November 25, 2024

Alert – శ్రీ రాంసాగర్‌ 40 గేట్లు ఎత్తివేత

తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ రాంసాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరద ఉద్ధృతి కొనసాగుతోంది.

దీంతో అధికారులు 40 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరిసర ప్రాంతాలకు సూచించారు. అలాగే శ్రీరాంసాగర్‌లో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను హెచ్చరించారు.ఇదిలాఉండగా.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇన్‌ఫ్రో 2 లక్ష 4 వేల 17 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ ఫ్లో 2 లక్షల 15వేల 853 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 80.5 టీఎంసీలు కాగా.. 72.99 టీఎంసీలకు చేరింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement