Friday, November 22, 2024

Alert – తుపాను పట్ల అప్రమత్తంగా ఉండండి – ప్రజలకు పొంగులేటి సూచన

ఖమ్మం: మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్, పాలేరు అసెంబ్లీ విజేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. మంగళవారం ఆయన హైదరాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా, ఖమ్మం కలెక్టర్ వీపీ. గౌతమ్, సీపీ విష్ణు ఎస్.వారియర్ కు ఫోన్ చేసి అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

లోతట్టు ప్రాంతాలు, వాగులు, చెరువుల వెంబడి వరద తాకిడితో ఎలాంటి నష్టం జరగకుండా అక్కడి అధికారులను అప్రమత్తం చేయాలని సూచించారు. ఉమ్మడి జిల్లా అధికారులు, సిబ్బంది నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ.. వరద సహాయక చర్యలను చేపట్టాలని అన్నారు. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సంఖ్య పెంచుకుని.. మెరుగైన సేవలు అందేలా చూడాలని తెలిపారు. ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా ప్రతి ఒక్కరినీ అప్రమత్తం చేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement