Wednesday, January 8, 2025

Alert – హెచ్ఎంపివి వైర‌స్ – జాగ్ర‌త్త‌లు పాటించాలంటూ వైద్య శాఖ ఆదేశం ….

హైద‌రాబాద్ – చైనా లో వ్యాప్తి చెందుతున్న‌ హెచ్ఎంపివి వైర‌స్ తెలంగాణ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది… ఈ వ్యాధి తెలంగాణ‌లోకి రాకుండా తెలంగాణ వైద్య శాఖ ముందుజాగ్రత్త చర్యలు చేప‌ట్టింది.. శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల నుండి సురక్షితంగా ఉండటానికి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది తెలంగాణ ఆరోగ్య శాఖ. రద్దీగా ఉండే ప్రదేశాలను నివారించాలని, సబ్బు లేదా శానిటైజర్‌తో చేతులను తరచుగా కడగాలని కోరింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయకూడదని, అనారోగ్యంగా ఉన్న వ్యక్తులు దగ్గరకి వెళ్లకూడదని అంటూ కొన్ని సూచించింది.. బ‌య‌టకు వ‌చ్చే స‌మ‌యంలో మాస్క్ వాడ‌టం మంచిద‌ని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement