Thursday, November 21, 2024

తెలంగాణ‌కు అల‌ర్ట్‌.. రెండ్రోజుల‌పాటు వర్షాలుంటాయ‌ని హెచ్చ‌రిక

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ :రాష్ట్రానికి రెండురోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 31, నవంబర్‌ 1న రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు పడుతాయని పేర్కొంది. ఆగ్నేయ ద్వీపకల్ప దిక్కున శనివారం నుంచి ఈశాన్య రుతుపవనాల వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున పలు చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శనివారమే తమిళనాడు తీరం పాండిచ్చేరి, కరైకాల్‌, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్‌లోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయని తెలిపింది. గాలులు ఈశాన్య, తూర్పు దిక్కుల నుంచి తెలంగాణలోకి వీస్తాయని వెల్లడించింది. 1న భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, మహబూ బాబాద్‌, నాగర్‌కర్నూలు, వనపర్తి, నారా యణపేట, జోగులాంబ గద్వాల, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈశా న్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని తెలిపింది.

- Advertisement -

నవంబరు రెండో వారం నుంచి పెరగనున్న చలి…

నవంబరు రెండోవారం నుంచి చలి తీవ్రత పెరగ నుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రెండు రోజులుగా చలి తీవ్రత కాస్త తగ్గిందని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు 15 జిల్లాలో సాధారణం కంటే తక్కువగా నమోదు కాగా… అత్యల్పంగా కుమ్రంభీం ఆసీఫాబాద్‌ జిల్లా సిర్పూరు (యూ)లో 12.5 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాగల మూడు రోజుల్లో హైదరాబాద్‌ మినహా అన్ని జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement