Saturday, November 23, 2024

హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు అల‌ర్ట్‌.. ఎమ‌ర్జెన్సీ అయితేనే బ‌య‌టికి రావాల‌న్న జీహెచ్ ఎంసీ

హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు వెద‌ర్ అల‌ర్ట్ అందించింది బ‌ల్దియా.. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి.. ఎమ‌ర్జెన్సీ అయితేనే ఇంట్లో నుంచి బ‌య‌టికి రావాల‌ని, లేకుంటే ఇంట్లోనే సేఫ్‌గా ఉండాల‌ని కోరారు జీహెచ్ ఎంసీ అధికారులు. మ‌ధ్యాహ్నం నుంచి సిటీ వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల్లో మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ఏరియాల్లో నీరు నిలిచింది. ప‌లు చోట్ల మ్యాన్ హోల్స్ నుంచి నీరు పెద్ద ఎత్తున పొంగి పొర్లుతోంది. కొన్ని చోట్ల ఓపెన్ నాలాలు కూడా ఉన్నాయి. దీంతో రోడ్ల‌మీద పారుతున్న వ‌ర్ష‌పు నీటితో ఎక్క‌డ ఎట్లాంటి ప్ర‌మాదం జ‌రుగుతుందో తెలియ‌దు కాబ‌ట్టి ప్ర‌జ‌లు, వాహ‌న‌దారులు సేఫ్‌గా ఉండాల‌ని అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా డీఆర్​ఎఫ్​ బృందాలను కూడా అప్రమత్తం చేశారు. వాటర్​ లాగింగ్​ ఏరియాల్లో వెంటనే సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కాగా, ఇవ్వాల మంగ‌ళ‌వారం సిటీలోని ప్ర‌ధాన ఏరియాల్లో కురిసిన వ‌ర్ష‌పాతం వివ‌రాలు మి.మీట‌ర్ల‌లో ఇట్లా ఉన్నాయి..
Neredmet – 52,
Alwal – 51
AS Rao Nagar – 43
Kapra – 42
Tirumalagiri – 39
Moulali – 35
Cherlapalli – 34
Safilguda – 34
Anandhbagh – 32
Malkajgiri – 29
Hafizpet – 26
West Maredpally – 26
Ferozguda – 20

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement