Friday, November 22, 2024

Alampur – ఎస్సీ నియోజకవర్గంలో రెడ్ల పెత్తనం ఏమిటి…బీఆర్ఎస్ ఎమ్మెల్యే అబ్రహం గరం గరం

ఉండవల్లి,మానవపాడు నవంబర్08(ప్రభన్యూస్) తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అబ్రహంను అభ్యర్థిగా ప్రకటించి చివరి నిమిషం లో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ప్రోత్సాహ బలంతో విజయుడికి బీఫాం అందించింది. దింతో.చల్లా వర్గీయులు ఎమ్మెల్యే అబ్రహం పార్టీ మారుతున్నట్లు,సోషల్ మీడియాలో అవాస్తవాన్ని ప్రచారం కావడం పై అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం స్పందించి ఇది నిజం కాదని ఖండిస్తూ, మీడియా సమావేశం నిర్వహించారు

బిఆర్ఎస్ పార్టీకి కష్టపడి ఇన్ని రోజులు సేవ చేసిన పార్టీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించానని, ఈ రోజు నాకు పార్టీ చాలా అన్యాయం చేసిందని,ఈవిషయం పై మనోవేదనకు గురైయానని బాధతో అన్నారు. ప్రస్తుతం నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. పార్టీ నన్ను కాదని ఈ రోజు ఒక అనామకుడుకు బీఫామ్ ఇవ్వడంపై ఆవేదన చెందాన్నారు. ఇది కేవలం చల్లా వెంకటరామిరెడ్డి ప్రభావంతో నాకు అన్యాయం చేశారన్నారు. నేను ఏ పార్టీకి వెళ్ళనన్ని,ఈరోజు జరిగిన సంఘటనతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం తెలిపారు.*డాక్టర్ గా ప్రజాసేవలో కొనసాగుతా*నన్ని నమ్ముకున్న కార్యకర్తలకు ఏకష్టం వచ్చిన 24గంటలు ఆదుకుంటానని,ఆందోళన చెందకుండా మీ వ్యక్తిగతంగా నచ్చిన పార్టీకీ సపోర్ట్ చెయండన్నారు.నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసిన నాకు అన్యాయాన్ని కి గురైయానుఅన్నారు.

పిచుకపై బ్రహ్మ అస్ర్తం సరైనది కాదు

- Advertisement -

చల్లా వెంకట్రామిరెడ్డి మీకున్న పలుకుబడితో ఒక పార్టీ స్థాపించి ప్రతి నియోజకవర్గానికి అభ్యర్థులను పెట్టుకోవాలే గానీ, రాజ్యాంగ విరుద్ధంగా ఎస్సీ నియోజకవర్గం పెత్తనం చెలాయించడం పిచ్చుక పై బ్రహ్మస్ర్తం ఉపయోగించేనట్టని అన్నారు.మీ బలం నిరూపించు కోవాలనుకుంటే పక్క జనరల్ నియోజకవర్గాల్లో పోటీ పడి గెలవాలని సూచించారు.అభిమానులు, కార్యకర్తలు,ఆందోళన చెందకుండా సరైన పద్ధతిలో నాయకులను ఎంచుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement