దావోస్ – దావోస్ లో పర్యటిస్తున్నమంత్రి కెటిఆర్ మరో సంస్థను హైదరాబాద్ కు తీసుకువస్తున్నారు.. ప్రముఖ ప్రైవేటు టెలికం గ్రూప్ సంస్థ భారతీ ఎయిర్ టెల్ తన డేటా సెంటర్ ను తెలంగాణలో నెలకొల్పనుంది.. ఈ మేరకు ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ తో తెలంగాణ ప్రభుత్వం దావోస్ లో ఒప్పందం కుదుర్చుకున్నాయి.. రూ.2 వేల కోట్లతో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనున్నారు.. ఈ ఒప్పంద కార్యక్రమంలో ఎయిర్ టెల్ వైస్ ఛైర్మన్ భారతీమిట్టల్, కెటిఆర్, జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement