హైదరాబాద్, ఆంధ్రప్రభ : మేక్ ఇన్ ఇండియా పథకంలో భాగంగా… క్రిమిసంహారకాలను నశింపచేసి గాలిని శుద్ధిచేసే బైపోలార్ ప్యూరిఫయర్‌ను కేంద్ర మత్రి కిషన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ బైపోలార్ ఎయిర్ ప్యూరిఫయర్‌ను జైత్ర డివైజెస్, సిస్టమ్స్ సంస్థ రూపొందించింది.
ప్రస్తుత కరోనా కాలంలో స్వచ్ఛమైన గాలిని అందించే పరికరాన్ని రూపొందించినందుకు జైత్ర కంపెనీ ప్రతినిధులను కిషన్‌రెడ్డి అభినందించారు. 1970 దశకంలో ఆహార శుద్ది కోసం ఈసాంకేతికతను ఉపయోగించారని చెప్పారు. జైత్ర బైపోలార్ ఆయోనైజేషన్ టెక్నాలజీ యంత్రం కొవిడ్‌ను కట్టడి చేయనుందని చెప్పారు.
కార్యక్రమంలో మాక్స్ విజన్ ఆసుపత్రుల వ్యవస్థాపకుడు, జైత్ర కంపెనీ కో.ఛైర్మన్ కాసు ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ… బైపోలార్ ఫ్యూరిఫయర్ యంత్రం గాలిలో బ్యాక్టిరియా కణ త్వచ ఉపరితలంపై రసాయన ప్రతిచర్యను జరిపి హానికరమైన సూక్ష్మజీవులను అంతం చేసి స్వచ్ఛమైన గాలిని అందిస్తుందన్నారు. జైత్ర ఎయిర్ ప్యూరిఫయర్ అత్యంత సురక్షితమైన, పర్యావరణహితమైన పరికరం అని స్పష్టం చేశారు.