రానున్న రోజుల్లో వైరా ప్రాజెక్ట్ ద్వారా గోదావరి నీళ్లను తెచ్చి లంకాసాగర్ ప్రాజెక్ట్ నింపుతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలో ఆయన నేడు కాంగ్రెస్ అభ్యర్ధి రామసహాయం రఘురాం రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడుతూ వేంసూరు మండలం లో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు.
గోదావరి నీళ్లు తప్ప ఏ పదవులు నాకు ముఖ్యం కాదన్నారు. , గతంలో చేసిన వారందరినీ మరిపించే విధంగా శ్రీరాముడి దయతో అభివృద్ధి చేసే అవకాశం కలిగిందన్నారు.
మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రఘురాం రెడ్డి భారీ మేజార్టీతో గెలిపించాలన్నారు.. కొంతమంది చేతగాని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు…. కష్టాలు , అప్పులు ఉన్నప్పటికీ , విచ్చిన్నమైన పరిపాలనను సరిదిద్ది అన్ని గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. స్వాతంత్ర దినోత్సవం నాటికి 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేస్తామని ఇప్పటికే సీఎం ప్రకటించారని తెలిపారు. రైతుల్లో చిరునవ్వు చూసేందుకు ఎన్ని ఇబ్బందులు ఉన్న రుణమాఫీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు.