పీసీసీ చీఫ్ ఎవరైతే బాగుంటుంది
సోనియా గాంధీ, రాహుల్, ఖర్గేతో చర్చలు
ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి ఉత్తమ్ అక్కడే
మంత్రివర్గ విస్తరణ అంశంపై మంతనాలు
నామినేటేడ్ పదవులపై నేడు స్పష్టత
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్: తెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చలు జరుపుతున్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్‌తోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ శుక్రవారం జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ మీటింగ్‌లో ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల చీఫ్ దీపా దాస్ మున్షీ చర్చలు జరుపుతున్నారు.
కాగా, ఈ సమావేశంలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై చర్చించారు. బీసీ వర్గాలకు పదవి ఇవ్వాలనే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.