Friday, November 22, 2024

Agri: నవంబర్‌ 1న అగ్రివర్సిటీల్లో రైతు కోటా సీట్ల కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ: ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రి విశ్వవిద్యాల యంలో రైతు కోటా కింద ఎంపిసి స్ట్రీమ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నవంబర్‌ 1న కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్టు యూనివర్శిటీ తెలిపింది. ఈ మేరకు ఆన్‌ లైన్‌లో దరఖాస్తు చేస్తున్న అభ్యర్దులు నవంబర్‌ 1న కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని యూనివర్శిటీ రిజిస్ట్రార్‌ సుధీర్‌కుమార్‌ తెలిపారు.

బీటెక్‌ అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌ కోర్సులో 16సీట్లు, బీటెక్‌ ఫుడ్‌ టెక్నాలజీ కోర్సులో 16సీట్లు, బీఎస్సీ (హానర్స్‌) కమ్యూనిటీ సైన్స్‌కోర్సులో 30 సీట్లకు టీఎస్‌ ఎంసెట్‌-2021 ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ ర్యాంకు ఆధారంగా రిజర్వేషన్లకు లోబడి సీట్లు భర్తీ చేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. కాగా ధరఖాస్తు చేసిన అభ్యర్ధులు రైతు కోటాలో సీటు పొందాలంటే కనీసం 4ఏళ్ల పాటు విధిగా గ్రామీణ ప్రాంతంలోని విద్యాసంస్థల్లో చదివి ఉండా లని, దీంతో పాటు కనీసం ఒక ఎకరం భూమి, తల్లి లేదా తండ్రి పేరు మీద ఉండా లని ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement