Friday, November 22, 2024

TS: పోచారం ఇంటి వద్ద ఆందోళన… మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్

హైదరాబాద్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈరోజు హైదరాబాద్‌ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ ఇంటి దగ్గర బాల్క సుమన్ నేతృత్వంలో ఆందోళన నిర్వహించారు. ఆ క్రమంలో పోచారం ఇంట్లోకి బీఆర్ఎస్ నేతలు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బాల్క సుమన్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

ఆ క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ నేతలను అడ్డుకోగా పోచారం ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. ఎంత సేపటికీ వినకపోవడంతో బాల్క సుమన్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని సమాచారం తెలుసుకుని ఆయన ఇంటి వద్దకు చేరుకుని బాల్క సుమన్ నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. అప్పటికే పోచారం సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement