ఎల్బీనగర్, నవంబర్ 15(ప్రభ న్యూస్) తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ పార్టీ విధ్వంసం సృష్టిస్తుందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, ఎల్బీనగర్ నియోజకవర్గం వర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కి గౌడ్ ఆరోపించారు. నాగోల్ డివిజన్లో రాక్ టౌన్ కాలనీలో డా.శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గం నుండి పోటీ చేయడం నా అదృష్టంగా భావిస్తున్న, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బిఆర్ఎస్ పార్టీ విధ్వంసం సృష్టిస్తుందనీ ఆరోపించారు. ఈ ధర్మ యుద్ధంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని కాలనీలలో పార్టీకి వస్తున్న ప్రచార స్పందన,స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తెలియజేస్తున్నారు. అయినప్పటికీ ఆఖరి ఓటు పడే వరకు జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలను కోరారు. 20 ఏళ్ల చరిత్రలో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా, జాతీయస్థాయిలో ఉంటూ రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలను పర్యవేక్షిస్తూ పార్టీ కొరకు కృషి చేస్తున్నాం అని తెలిపారు. పార్టీ ఫిరాయింపు దారుడు, కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తానంటే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు.
ఒకరినొకరు తిట్టుకున్న సుధీర్ రెడ్డి, రామ్మోహన్ గౌడ్ కలయిక దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టుగా ఉందన్నారు.
ఇగ బిజెపి వాడిపోయిన పుష్పం లాంటిది,దైవారాధన పనికిరాదన్నారు. కళ్ళముందు అభివృద్ధి అంటున్నారు.
ఆర్. కృష్ణయ్య హయాంలో ఫ్లై ఓవర్లకు నిధులు విడుదలయితే పూర్తి అయ్యే సమయానికి ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డి అంతా నేనే చేసినట్లు చెప్పడం ఎవరికో పుట్టిన బిడ్డకు తండ్రి నేనే అన్నట్టుగా ఉందన్నారు. నియోజకవర్గంలో యువత గంజాయికి అలవాటు పడుతున్నారు, వారిని సన్మార్గంలో తీసుకెళ్లాలని,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తూ జాబ్ క్యాలెండర్ ఇయర్ ప్రవేశపెడతాం అని హామీ ఇచ్చారు. కార్యకర్తలు ఆరు గ్యారెంటీ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని మార్గదర్శకం చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో వృత్తి విద్య, ఉద్యోగ,వ్యాపార అవకాశాలు లోకల్ నాన్ లోకల్ అని తేడా లేకుండా అందరికీ లభించేలా కృషి చేస్తానన్నారు. మార్పు రావాలంటే కారు పోవాలని కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి, వజీర్ ప్రకాష్, డివిజన్ ప్రెసిడెంట్ మంజుల రెడ్డి, కృపాకర్ రెడ్డి, చెరుకు చిరంజీవి గౌడ్, డా.సత్విన్,శైలజ రెడ్డి,టిజెఎస్ పల్లె వినయ్, రంగారెడ్డి, సిపిఐ బొడ్డుపల్లి కృష్ణ, రాము గౌడ్ రాక్ హిల్స్ కాలనీ ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి, జయప్రకాష్ సేటు, అడ్వకేట్ వెంకట్ గౌడ్, ఉపేందర్, నర్సింహ గౌడ్, సురేందర్ రెడ్డి, శేషయ్య శెట్టి తదితరులు పాల్గొన్నారు.