- హుజూరాబాద్‌పై అస్త్రశస్త్రాలను సిద్ధంచేస్తున్న కమలం పార్టీ నేతలు
- అమిత్‌షా సభపై చివరి క్షణం వరకూ గోప్యత
హైదరాబాద్, ఆంధ్రప్రభ : హుజూరాబాద్ ఉప ఎన్నికను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మంత్రి పదవికి, ఎమ్మెల్యే స్థానానికి ఈటల రాజీనా మా చేసి బీజేపీలో చేరిన క్షణం నుంచి హుజూరా బాద్‌ను ఎట్టి పరిస్థితులలో కైవసం చేసుకోవాలని కమలం పార్టీ నిర్ణయించుకుంది. రాష్ట్ర పార్టీ నేతల పట్టుదలకు జాతీయ పార్టీ కూడా పూర్తి అండదండగా నిలుస్తోంది. టీఆర్‌ఎస్‌కు ధీటుగా నియోజక వర్గంలో బీజేపీ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. అయితే రాష్ట్ర స్థాయి నేతలు, కేంద్ర స్థాయి నేతలతో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు కీలకులు హుజూ రాబాద్ ప్రచారంలో పాల్గొంటారని ప్రకటించినప్ప టికీ ఇప్పటి వరకు కొంత మంది నేతలే ప్రచారంలో పాల్గొంటున్నారు. నామినేషన్ల ఉప సంహరణ గడువు బుధవారంతో ముగియడంతో బరిలో 30 మంది అభ్యర్థులున్నట్లు తేలింది. ఇక ప్రచారంపైనే పార్టీలన్ని దృష్టి పెట్టిన నేపథ్యంలో బీజేపీ కూడా సన్నద్దమవు తోంది. మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగిం చుకున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రస్తుతం కరీంనగర్‌లో దేవిశరన్నవరాత్రుల దీక్షలో ఉన్నారు. దీక్ష ముగించిన అనంతరం సంజయ్ 16 లేదా 17వ తేదీ నుంచి హుజూరాబాద్ ప్రచారంలో జోరుగా పాల్గొంటారని పార్టీ నేతలు అంటున్నారు. నియోజకవర్గంలోని అయి దు మండలాలలో ప్రచార సభలను నిర్వహించడంతో పాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. వీరికి తోడుగా శ్రేణుల న్నింటినీ హుజూరాబాద్‌కు రావాలని, ప్రతి ఒక్కరూ వారికి కేటాయించిన శక్తి కేంద్రాలలో మోహరిం చాలన్న ఆదేశాలు వెళ్ళాయి. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో చాలా మంది నేతలు, కార్య కర్తలు తమ తమ ప్రాంతాలలోనే ఉండాల్సిన అవసరం ఉందంటూ వచ్చిన విజ్ఞప్తుల మేరకు అనుమతించిన రాష్ట్ర పార్టీ 17వ తేదీలోగా అందరూ హుజూరాబాద్‌లో కేటాయించిన కేంద్రాలలో రిపోర్ట్ చేయాలని పార్టీ ఆదేశించింది.
సంజయ్, కిషన్‌రెడ్డిలతో పాటు రాష్ట్ర స్థాయిలోని నేతలందరూ నిత్యం నియోజకవర్గంలో ఏదో ఒక చోట పాదయాత్ర, బహిరంగసభ, హాల్ మీటింగ్, వివిధ కులాల సమావేశాలలో తప్పనిసరిగా పాల్గొనేలా పార్టీ నాయకత్వం యోజన చేసింది. స్టార్ క్యాంపెయి నర్లందరూ ప్రచారం గడువు ముగిసే చివరి క్షణం వరకు నియోజకవర్గంలోనే ఉండేలా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఏ సభలో ఏం మాట్లాడాలి, ప్రత్యర్థి మాట్లాడే ప్రతి మాటకు ఎలా జవాబివ్వాలనే అంశాలపై ఆయా నేతలకు సమగ్ర స మాచారాన్ని చేర వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. జాతీయ పార్టీ కూడా హుజూరాబాద్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈటల గెలుపు బాధ్యతను సంజయ్, కిషన్‌రెడ్డిలు తమ భుజాలపై వేసుకున్నారు.
అమిత్‌షా సభపై తర్జన భర్జన
ఈటల గెలుపును తమ గెలుపుగా భావిస్తున్న జాతీయ పార్టీ ప్రచారం సందర్భంగా ఏ నేతను ఎక్కడ కు పంపించాలి, ఎప్పుడు పంపించాలన్న సమాచా రాన్ని రాష్ట్ర పార్టీ నుంచి తెప్పించుకుంది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లను కూడా చేసినట్లు సమా చారం. ఇందులో భాగంగానే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయిం చింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం కోవిడ్ నిబంధనలను విధించడంతో అమిత్‌షా సభపై కొంత సందిగ్ధంలో ఉన్నారు.