Friday, November 22, 2024

చిన్న బ్రేక్ తర్వాత హైదరాబాద్‌లో మళ్లీ కురుస్తున్న‌ వర్షాలు.. బీ అలర్ట్​ అంటున్న వాతావరణ శాఖ

కొద్దిపాటి విరామం తర్వాత హైదరాబాద్‌లో ఇవ్వాల (శనివారం) కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. అయితే నగరం సాధారణం కంటే చల్లగా మారింది. సిటీలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి.. గరిష్టంగా 29.2 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 22.4 డిగ్రీల సెల్సియస్ గా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 48 గంటలలో సిటీ మేఘావృతమై, ఉరుములతో కూడిన జల్లులతో వ‌ర్షం కురుస్తూ.. గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్‌తో ఉండే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు.

ఇక.. తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. జూన్ 17న నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ (రూరల్), వరంగల్ (అర్బన్) జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

జూన్ 18న నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ (రూరల్), వరంగల్ (అర్బన్), జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

జూన్ 19న ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ (రూరల్), వరంగల్ (అర్బన్), జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న‌ట్టు వాతావ‌ర‌ణ అధికారులు వెల్ల‌డించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement