Thursday, November 28, 2024

TG | ఏసీబీ వ‌ల‌లో ఏఈ.. రూ.5వేల లంచంతో ప‌ట్టివేత‌

బిల్లుల చెల్లింపు కోసం లంచం డిమాండ్‌
ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : లంచం తీసుకుంటున్న పంచాయ‌తీ రాజ్ ఏఈని ఏసీబీ అధికారులు ప‌ట్టుకున్నారు. గురువారం వరంగల్ జిల్లా పరిషత్ కార్యాలయంలో ప‌నిచేస్తున్న ఏఈ కార్తీక్ రూ.ఐదు వేలు లంచం తీసుకుంటుండ‌గా ప‌ట్టుబ‌డ్డాడు.

ఓ కాంట్రాక్ట్‌ బిల్లు ఫైల్ క్లియరెన్స్ కోసం వర్థన్నపేట మండలం కడారి గూడెంకు చెందిన మాజీ సర్పంచ్ సతీష్ ను ఏఈ కార్తీక్ లంచం డిమాండ్ చేశాడు. వెంటనే బాధితుడు ఏసీపీని ఆశ్రయించాడు. హరిత కాకతీయ హోటల్ లో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ప‌ట్టుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement