Tuesday, November 26, 2024

తెలంగాణలో అడ్వెంచర్​ టూరిజం.. సెప్టెంబర్​ నుంచి వరల్డ్​ వాటర్​ఫాల్​ పోటీలు

ఉవ్వెత్తున దూకే జలపాత ధారల్లో తాడు సాయంతో పై నుంచి కిందకు చేరడమే వాటర్‌ఫాల్‌ రాప్లింప్‌ గా పిలుస్తారు. ప్రపంచంలోని చాలా దేశాలు అడ్వెంచర్‌ టూరిజంలో భాగంగా సాహసాలు చేసేవారి కోసం ఈ పోటీలు పెడుతుంటాయి. అయితే ఈ సారి జ‌రిగే ప్రపంచకప్‌కు తెలంగాణ ఆతిథ్యమివ్వ‌నుంది.. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం మాన్‌కాపూర్‌ గ్రామ సమీపంలోని గాయత్రి జలపాతం వద్ద సెప్టెంబర్‌ 30 నుంచి అక్టోబర్‌ 4 వరకు వరల్డ్ వాటర్‌ఫాల్‌ రాప్లింగ్ పోటీలు జరగనున్నాయి పైగా ఇలాంటి పోటీల‌కు తెలంగాణ ఆతిథ్య‌మివ్వ‌డం ఇదే తొలిసారి. అయితే ఇప్పుడు జరగనున్న రాప్లింగ్ వరల్డ్ కప్ మూడోది. కరోనా కారణంగా ఏడాది విరామం తర్వాత ఈ పోటీలను నిర్వహిస్తున్నారు.

గతంలో రెండు ప్రపంచ వాటర్ ఫాల్ రాప్లింగ్ పోటీలు 2019, 2020లో ఏపీ అరకులోయలోని 420 అడుగుల కటిక జలపాతం వద్ద నిర్వహించారు. ఇప్ప‌డు తెలంగాణ‌లో జ‌రిగే ఈ పోటీల్లో సుమారు 30కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొనున్నారు. ప్రపంచవ్యాప్తంగా 33 టీవీ ఛానెల్స్‌ ఈ పోటీలను టెలికాస్ట్‌ చేసే అవకాశం ఉంది. రెండు విభాగాల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లకు మెడల్స్, పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు, నగదు ప్రోత్సాహకాలు అందజేస్తారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల నుంచి 30కి పైగా జట్లు ఈ ఈవెంట్‌లో పాల్గొననున్నాయి. దరఖాస్తులు ఇప్పటికే రావడం ప్రారంభమయ్యాయి. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ప్రోగ్రెస్‌లో ఉంది. త్వరలో ట్రయల్ రన్ నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు కొన‌సాగుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement