Tuesday, November 19, 2024

హైస్కూల్ ద‌త్త‌త‌.. ముఖ్య అతిథిగా మంత్రి హ‌రీశ్ రావు

ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ (EFLU) యూనివర్సిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఇంద్రనగర్ జెడ్పీ హైస్కూలును దత్తత తీసుకునే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో EFLU వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సురేష్ కుమార్, చైర్పర్సన్ రోజా శర్మ, అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్, ఉపాధ్యాయులు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఇంద్రానగర్ జెడ్పీ హైస్కూల్ లోని విద్యార్థులకు ఇంగ్లీష్ .. ఫారెన్ లాంగ్వేజ్ (ఫ్రెంచ్ ,స్పానిష్) బోధనలు అందించనున్నారు. ప్రపంచంతో పోటీపడేందుకు చదువుతో పాటు విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ను పెంపొందించేందుకు ఇంగ్లీష్ .. ఫారిన్ లాంగ్వేజ్ శిక్షణ విద్యార్ధులకు అందించనున్నారు.
ఈ మేరకు ఇంద్రానగర్ జెడ్పిహెచ్ పాఠశాలకు ఇఫ్లూ విశ్వ విద్యాలయం ఇంగ్లీష్ ఫారెన్ లాంగ్వేజ్ బోధనలు అందించేందుకు ఎంవోయు పాత్రని పాఠశాల ప్రధానోపాధ్యాయునికి వైస్ చాన్సలర్ సురేష్ కుమార్ అందించారు.

కాగా విద్యార్థులతో ముచ్చటించిన మంత్రి వారి విద్యాభ్యాసాలకు సంబంధించి విషయాలను అడిగి తెలుసుకోవడమే కాకుండా వారిలో చదువుపై ఇంకా ఉత్సాహాన్ని పెంచే విధంగా ప్రోత్సహించి వారితో మాటామంతి కలిపారు. విద్యార్థులకు అందిస్తున్న డిజిటల్ పాఠాలకు సంబంధించి విషయాలను అడిగి తెలుసుకుని కాసేపు వారితో సరదాగా పదవ తరగతి చదువుతున్న తీరును ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. తన కోరికను మన్నించి EFLU యూనివర్సిటీ వైస్ చాన్సలర్ మిత్రుడు సురేష్ సిద్దిపేటలో స్కూల్ దత్తత తీసుకొని ఇక్కడ విద్యార్థులకు ఇంగ్లీష్ తో పాటు ఫారిన్ లాంగ్వేజ్ లో శిక్షణ ఇచ్చినందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆల్ ఇండియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ సిద్దిపేటలో ఒక సాధారణ స్కూల్ కి రావడం చరిత్రలో ఇదే తొలిసారి. ఇక్కడ విద్యార్థులకు ఇంగ్లీష్ తో పాటు ఫ్రెంచ్, స్పానిష్ లో శిక్షణ ఇచ్చేందుకు EFLU విశ్వవిద్యాలయం వారు ఒప్పుకున్నారు.ఆన్ లైన్ లో ఈ వారం నుండే తరగతులు ప్రారంభించ బోతున్నాం. బోధనలు మరింత అర్ధమైయ్యేందుకు విద్యార్థులకు EFLU విశ్వ విద్యాలయంకు తీసుకెళ్లి అక్కడ అందించే శిక్షణను ప్రత్యక్షంగా విద్యార్థులకు చూపిస్తారు. విద్యార్థులు చదువుతో పాటు వారి లక్ష్యాలను చేరుకోవాలంటే శరీరానికి వ్యాయామం అదేవిధంగా యోగా అవసరం. అలా ఏకాగ్రతను పెంచేందుకు యోగా చేయడం ద్వారా చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. ఇందిరా నగర్ స్కూల్ ఇంత బాగా అభివృద్ధి చేసిన ఉపాధ్యాయులకు పిల్లలకు, పిల్లలు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అదే విధంగా ఈ సంవత్సరం పదవ తరగతిలో మంచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు తానే స్వయంగా బహుమతులను అందిస్తానని మంత్రి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement