ప్రభన్యూస్ బ్యూరో, ఉమ్మడిరంగారెడ్డి : తెలంగాణలోని రామంతాపూర్, బేగంపేట పబ్లిక్ స్కూళ్లలో ఒకటో తరగతి ప్రవేశాల కోసం గిరిజన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ అమోయ్‌కుమార్ సూచించారు. మార్చి 5వ తేదీవరకు దరఖాస్తలకు అవకాశం కల్పించినట్టు తెలిపారు. జూన్ 1వ తేదీ 2016 నుండి మే 31వ తేదీ 2017 సంవత్సరం మధ్య జన్మించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే వాళ్లు రంగారెడ్డి జిల్లా వారై ఉండాలని, విద్యార్థుల తల్లిదండ్రుల సంవత్సరాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.50లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2లక్షల వరకు ఉండాలని సూచించారు. పూర్తి చేసిన దరఖాస్తులను మార్చి 5వ తేదీ సాయంత్రం లోగా స్నేహ సిల్వర్‌జుబ్లీ భవనంలోని నాలుగో అంతస్తులోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయాలని కలెక్టర్ అమోయ్‌కుమార్ సూచించారు.
పబ్లిక్ స్కూల్‌లో ప్రవేశాలు.. రామంతాపూర్, బేగంపేట స్కూళ్లలో చేరికకు దరఖాస్తులు
Advertisement
తాజా వార్తలు
Advertisement