Tuesday, November 26, 2024

317 జీవోతో ఆదివాసీలకు అన్యాయం

తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్డ్ ప్రాంత చట్టాలు, జీవోలకు విరుద్ధంగా మల్టిజోనల్ వ్యవస్థ 317 జీవోను ప్రవేశ పెట్టిందని ఆదివాసీ హక్కుల పోరాట సమితి నేతలు అన్నారు. షెడ్యూల్డ్ ప్రాంత వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్ర అని వారు ఆరోపించారు. ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయంపై మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంత బంద్ ను కొనసాగించారు. ఈ బంద్ లో భాగంగా న్యూడేమోక్రసి,వ్యాపార, వాణిజ్య, వర్తక వ్యాపారులు సంపూర్ణ మద్దతు ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆదివాసీ హక్కుల పోరాట సమతి నాయకులు మాట్లాడారు. విద్యా, ఉద్యోగాల్లో ఆదివాసీలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతాలు లేకుండా చేసి ఆదివాసీల ప్రత్యేకతను దిగజార్చరని మండిపడ్డారు. తెలంగాణాలో షెడ్యూల్డ్ ప్రాంతాన్ని జిల్లాల విభజన పేరుతో వేరు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మనోభావాలను దెబ్బ తీస్తున్న ప్రభుత్వం పైన ఆదివాసీలు తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement